Telugu News » Ponnam : ఎమ్మెల్యే సతీష్ ను ఓడిస్తా.. ఇక యుద్ధమే!

Ponnam : ఎమ్మెల్యే సతీష్ ను ఓడిస్తా.. ఇక యుద్ధమే!

ద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు కంటే అద్భుతంగా ఉన్న హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువును పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారు.

by admin
ponnam prabhakar in Husnabad

పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ

హుస్నాబాద్ (Husnabad) ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నా. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నా నివాసాన్ని, ఓటు హక్కును కరీంనగర్ (Karimnagar) నుండి హుస్నాబాద్ కు మార్చుకున్నా. పదేండ్ల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో బుధవారం జరగబోయే బీఆర్ఎస్ (BRS) సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్పాలి.

ponnam prabhakar in Husnabad

గౌరవెల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 70 శాతం పనులు పూర్తి చేసిన తాము గొప్పో.. లేక, మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి పది సంవత్సరాల సమయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పదో రైతులు ఆలోచించాలి. సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు కంటే అద్భుతంగా ఉన్న హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువును పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలే నిర్లక్ష్యానికి గురయ్యారు. దీని గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. బలహీన వర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కార్పొరేషన్‌ లను ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ అండగా ఉంటుందనే నమ్మకాన్ని బీసీ డిక్లరేషన్‌ ద్వారా కల్పిస్తాం.

You may also like

Leave a Comment