– రాహుల్ గాంధీవి అర్థం లేని మాటలు
– కేసులు పెట్టడం లేదు కాబట్టి..
– కేసీఆర్ బీజేపీ ఏజెంట్ అయితే..
– సోనియా గాంధీ కూడా అదేనా?
– ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
– సంపద సృష్టించకపోతే.. పంపిణీ ఎలా?
– జగన్ సర్కార్ నే అన్నారంటూ టీడీపీ టార్గెట్
బిహార్ (Bihar) లో వ్యూహాత్మక అడుగులు వేస్తున్న ఎన్నికల వ్యూహాకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అవతార్ లైవ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన షార్ప్ ఇన్ సైడ్ అండ్ ఇండియా-2024 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై మండిపడ్డారు. అలాగే, ఏపీ (Andhra Pradesh) లో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ (Telangana) ఎన్నికల పర్యటనలో రాహుల్ గాంధీ చెసిన వ్యాఖ్యలపై స్పందించారు పీకే. రాహుల్.. సీఎం కేసీఆర్ (CM KCR) మీద ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం లేదు కాబట్టి ఆయన బీజేపీ ఏజెంట్ అని అంటున్నారని.. మరి, సోనియా గాంధీ (Sonia Gandhi) మీద కూడా కేసుల వేధింపులు లేవు కదా.. ఆమె కూడా బీజేపీ ఏజెంట్ అనుకోవచ్చా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్న మాట వాస్తవమే కానీ, కేసులు లేని ప్రతి ఒక్కరూ బీజేపీ ఏజెంట్ అనుకోవడం మూర్ఖత్వం అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
ఇక ఏపీ పరిస్థితులపై పీకే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. జగన్ (Jagan) పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఈయనే. జర్నలిస్టు సోమా చౌదరి ఏపీ గురించి ప్రస్తావించగా.. సంపద సృష్టిస్తేనే పంపిణీ చేయడానికి వీలవుతుందని అన్నారు ప్రశాంత్ కిశోర్. ‘‘ఆంధ్రప్రదేశ్ ను మీరు ఉదాహరణగా చూపారు. సంపద సృష్టిస్తేనే పంపిణీ చేయడానికి వీలవుతుంది. సంపద సృష్టికి ప్రభుత్వాలు అనుకూలమైన వాతావరణం కల్పించాలి. అలా సృష్టించిన సంపదను రాష్ట్రం క్రియాశీలకంగా పంపిణీ చేయాలి. అది జరగకపోతే పంచడానికి డబ్బులు ఎలా వస్తాయి? ఇది అపరిమిత రుణాలకు మాత్రమే దారి తీస్తుంది. సంపద సృష్టించగలిగితేనే దానిని పంపిణీ చేయగలుతాం’’ అని ప్రశాంత్ కిషోర్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
పీకే వీడియోను టీడీపీ (TDP) సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేశారు. అభివృద్ధి చేయకుండా, డబ్బును సంపాదించకుండా, పంచుకుంటూ పోతే ఏపీలా అడుక్కుతింటామని ప్రశాంత్ కిశోర్ చెప్పారని అన్నారు. అన్ని రాష్ట్రాలూ ఏపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలని పీకే అన్నారని ట్వీట్ చేశారు.