తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిందూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మోడీ(Pm modi) ఉగాది(Ugadi Wishes) శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు. ఈ పర్వదినం దేశప్రజల జీవితాల్లో కొత్త దనాన్ని, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు! pic.twitter.com/n1QRkLUWIv
— Narendra Modi (@narendramodi) April 9, 2024
ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాలలో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సును నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగ మీ అందరి జీవితాలలో అన్ని అంశాల్లోనూ సంతోషాన్ని తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను అంటూ తెలుగులో రాసుకొచ్చారు ప్రధాని మోడీ..
తెలుగు భాషతో పాటు మొత్తం ఐదు భాషల్లో ప్రధాని మోడీ దేశప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.అయితే, ఉగాది పండుగను తెలుగు నూతన సంవత్సరంగా ప్రజలు పిలుచుకుంటుంటారు. సాధారణంగా జనవరి 1న వచ్చేది ఇంగ్లిష్ క్యాలెండర్ న్యూ ఇయర్.
భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉగాది పండుగతో కొత్త సంవత్సరాదికి వెల్‌కమ్ చెబుతారు.పిండి వంటలు చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది రోజున శ్రావణ పంచాంగాన్ని పండితులు వినిపిస్తుంటారు. తెలుగు నూతన సంవత్సరాదిలో దేశంలోని ఆర్థిక, రాజకీయ పరిస్థితులు , రాజకీయ నేతల భవిష్యత్, వ్యాపారవేత్తలకు అనుకూలతలు, ప్రతికూలతలు గురించి వివరిస్తుంటారు. కొత్త ఏడాదిలో ఎవరికి కలిసిరానుంది. ఆరోగ్య పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారి వారి రాశిచక్రాల ప్రకారం పండితులు చెబుతుంటారు.