Telugu News » v ED Arrest: టీఎంసీకి ఈడీ షాక్… మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్ అరెస్టు…..!

v ED Arrest: టీఎంసీకి ఈడీ షాక్… మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్ అరెస్టు…..!

గురువారం అర్ధరాత్రి ధాటిన తర్వాత ఆయన్ని ఈడీ అదుపులోకి తీసుకుంది.

by Ramu

బెంగాల్ మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్‌ (Jyothi Priya Mallik) కు ఈడీ షాక్ ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన్ని ఈడీ (ED) అరెస్టు చేసింది. రేషన్ పంపిణీ స్కామ్ కు సంబంధించి కోల్ కతాలోని సాల్ట్ లేక్‌లో ఆయన నివాసంలో ఈడీ దాడులు చేసింది. గురువారం అర్ధరాత్రి ధాటిన తర్వాత ఆయన్ని ఈడీ అదుపులోకి తీసుకుంది.

ఆయన అరెస్టుకు సంబంధించి ఈడీ ఓ ప్రకటనను విడుదల చేసింది. తనపై తీవ్రమైన కుట్ర జరిగిందని మంత్రి వెల్లడించారు. ఆయన అరెస్టుపై ఇప్పటి వరకు టీఎంసీ స్పందించక పోవడం గమనార్హం. రేషన్ పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. మల్లిక్ ప్రస్థుతం బెంగాల్ అటవీ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.

గతంలో ఆయన పౌర సరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉపాధ్యాయుల నియామక కుంభ కోణానికి సంబంధించి ఈడీ దాడులు చేసింది. ఈ కేసులో మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ, అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీని పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు పశువుల అక్రమ రవాణా కేసులో అనుబ్రత మోండల్ అరెస్టు అయ్యారు.

ఇక బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి సీఎం మేనల్లుడు, టిఎంసి అధినేత అభిషేక్ బెనర్జీని ఈడీ విచారిస్తోంది. ఆయనకు ఇప్పటికే పలు మార్లు ఈడీ సమన్లు కూడా పంపింది. పలు మార్లు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇది ఇలా వుంటే దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని ప్రతి పక్షాలపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

You may also like

Leave a Comment