“రండి కలిసి ఆడుదాం” అనే నినాదంతో ఇటీవల షారుక్ ఖాన్(Shahrukh Khan) వివాదాన్ని ఆహ్వానించినట్టుగా అయ్యింది. ఇటీవల షారుఖ్ ఆన్ లైన్ గేమింగ్(Online gaming)యాడ్ లో పాల్గొనడం తెలిసిందే.దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఆందోళనకారులు మోహరించి ముంబైలోని ఆయన నివాసం ఉంటున్న మన్నత్ వద్ద నిరసనలు చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
షారుక్ రీసెంట్ గా ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన యాడ్‌లో నటించడంతో వివాదానికి తెరలేపింది. షారుక్ ఈ తరహా యాడ్‌లో నటించడంపై సోషల్ మీడియాలో ఆనపై విమర్శల దాడి చెలరేగింది.
అంతటితో ఆగని నిరసన కారులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో మన్నత్ వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఆన్‌లైన్ రమ్మీ పోర్టల్ ఏ23(Online Rummy Portal A23)ఇటీవల షారుక్ ఖాన్‌ను ఏ23 గేమ్స్ ప్లాట్‌ఫాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
యాప్‌కు ఇటీవల షారుక్ చేసిన ప్రోమోలో ‘రండి కలిసి ఆడదాం’ అనడం జీర్ణించుకోలేని సాంప్రదాయవాదులు షారుక్ ని తప్పుబడుతున్నారు. సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన షారుక్ ఇలా ఆన్‌లైన్ రమ్మీ జూదానికి రమ్మని పిలవడంపై అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై అన్‌టచ్ యూత్ ఫౌండేషన్(Untouch Youth Foundation)సారధ్యంలో నిరసనలు చేపట్టారు. జంగిల్ రమ్మీ, జుపీ వంటి ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని ఈ గ్రూప్ వెల్లడించింది.
ప్రముఖ నటీనటులు ఈ తరహా ప్రకటనల్లో పాల్గొంటూ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన్నత్ బంగ్లా(Mannat Bungalow) ఎదుట నిరసనలు చేపడతామని ఈ గ్రూప్ ప్రకటించింది.