Telugu News » Purandhareswari : భవిష్యత్తు కోసం యువత ఏపీని విడిచి వెళ్తున్నారు

Purandhareswari : భవిష్యత్తు కోసం యువత ఏపీని విడిచి వెళ్తున్నారు

పోలవరం బిల్లులు సకాలం చూపించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. డయాఫ్రామ్ వాల్ డిజైన్ లోపానికి కేంద్రాన్ని ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు.

by Prasanna
Purandhareswari

ఏపీకి కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఏమీ ఇవ్వలేదు అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని బీజెపీ (BJP) శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. పోలవరం, ప్రత్యేక హోదా (Special Status) విషయంలో కూడా దుష్ప్రచారం జరుగుతోందని ఆమె అన్నారు. ప్రత్యేక హోదాకు సరిసమానమైన ప్యాకేజీని ఇస్తామంటే అప్పటి ప్రభుత్వం అంగీకరించింది అనే విషయాన్ని పురంధరేశ్వరి గుర్తు చేశారు.

Purandhareswari

పోలవరం బిల్లులు సకాలంలో పంపించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. డయాఫ్రామ్ వాల్ డిజైన్ లోపానికి కేంద్రాన్ని ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రాన్ని తప్పుపడుతున్నారని చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణకు బీజేపీ అధికారంలోకి రాక ముందే ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది అని ఆమె తెలిపారు. స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ జరిగితే సిబ్బంది భవిష్యత్తు బాద్యత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.

ఏపీలో కక్ష పూరిత రాజకీయాలు చూస్తున్నాము అన్న పురంధరేశ్వరి, ఏపీని అప్పుల ఊబిలోకి వైసీపీ ప్రభుత్వం నెట్టేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారని, అలాగే చివరకు ఉద్యోగుల భవిష్య నిధిని ఇతర అవసరాలకు తరలించేశారని, ఈ విషయంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో నాణ్యత లేని మద్యం ప్రజలచే తాగించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా దోచుకుంటున్నారని పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుపై భయంతో యువత ఏపీ నుంచి వెళ్లిపోతున్నారని విమర్శించారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో క్రెడిట్ కోసం కొందరు మాట్లాడుతున్నారు, మరి అప్పట్లోనే ఆ బిల్లును ఎందుకు చట్టంగా మార్చలేకపోయారని పురంధరేశ్వరి అడిగారు.

విశాఖపట్నంలో బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశంలో ఈ కామెంట్లు చేసిన పురంధరేశ్వరి, పార్టీని బలపేతం చేసేందుకు ప్రజల్లోకి ఈ విషయాలన్ని తీసుకుని వెళ్లాలని కార్యకర్తలు, నాయకులను కోరారు.

You may also like

Leave a Comment