కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)|పై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ కేవలం రెండింటిని మాత్రమే బాగా ప్రేమిస్తారని అన్నారు. అందులో ఒకటి ఇటలీ, మరొకటి ప్రధాని మోడీ అని తెలిపారు. రాహుల్ గాంధీ తల్లి ఇటలీ నుంచి వచ్చారకు కాబట్టి రాహుల్ కు ఇటలీ అంటే ఇష్టమని వెల్లడించారు.
ఇక ప్రధాని మోడీ రాహుల్ కు అధికారం ఇస్తారు కాబట్టి మోడి ఆయనకు అధికారం ఇస్తారు కాబట్టి రాహుల్ కు మోడీ అంటే ఇష్టమని పేర్కొన్నారు. యూపీలో అమేథి నియోజక వర్గంలో రాహుల్ గాంధీ ఓటమిని ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు. ప్రజలు రాహుల్ గాంధీకి కాకుండా స్మృతీ ఇరానీకి ఎందుకు మద్దతు తెలిపారని ఆయన ఎద్దేవా చేశారు.
దయచేసి ఇక నుంచి రాహుల్ గాంధీ ఒంటరిగా ఉండవద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీకి 50 ఏండ్లు నిండాయని అన్నారు. ఎంపీ రాహుల్ గాంధీకి ఇంట్లో తోడు లేకపోవడంతో ఆయన ఎప్పడూ స్నేహితుల గురించే ఆలోచిస్తున్నారంటూ చురకలు అంటించారు. ఇకపై ఇలాంటి పిచ్చికి పాల్పడవద్దని, ఇది సరైన వయసు కాదని సెటైర్లు వేశారు.
ఇక నుంచి రాహుల్ గాంధీ ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడవద్దని సూచించారు. అలాంటి పిచ్చి పనులు చేసేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. అవినీతి ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. మోడీకి ఇద్దరు మిత్రులు ఉన్నారని తెలిపారు. అందులో ఒకరు సీఎం కేసీఆర్ అని, మరొకరు అసదుద్దీన్ ఓవైసీ అని ఆరోపించారు.