Telugu News » AQI : కాస్త మెరుగుపడిన ఏక్యూఐ…. దీపావళి నేపథ్యంలో సర్కార్ కొత్త క్యాంపెయిన్…!

AQI : కాస్త మెరుగుపడిన ఏక్యూఐ…. దీపావళి నేపథ్యంలో సర్కార్ కొత్త క్యాంపెయిన్…!

ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. కానీ ఇప్పటికీ వాయు నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలోనే ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది.

by Ramu
Rain in capital city improves AQI declines to 339 today

దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత (AQI) స్వల్పంగా మెరుగుపడింది. నిన్న కురిసిన వర్షానికి వాతావరణంలోని విషపూరిత పొగమంచు (Toxic haze) కొట్టుకుపోయింది. దీంతో ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. కానీ ఇప్పటికీ వాయు నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలోనే ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది.

ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 339 గా ఉన్నట్టు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR)తెలిపింది. ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచీ 282 గా ఉన్నట్టు పేర్కొంది. ఆర్ కే పురంలో 220, పంజాబీ బాగ్ లో 236, ఐటీఓ 263గా ఏక్యూఐ ఉన్నట్టు చెప్పింది.

ఇది ఇలా వుంటే ఢిల్లీలో కాలుష్య స్థాయి కాస్త తగ్గడంతో సరి-బేసి విధానాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని అనుకుంటున్నట్టు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. నగరంలో వాయు నాణ్యత సూచీ 450 నుంచి 300కు తగ్గి పోయిందన్నారు. ఈ నేపథ్యంలో సరి-బేసీ విధానాన్ని వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు.

దీపావళి పండుగ తర్వాత మరోసార కాలుష్య స్థాయిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అప్పటి పరిస్థితుల ఆధారంగా సరి-బేసి విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీపావళి నేపథ్యంలో కాలుష్యం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ‘దీపాలు వెలిగించండి… బాణా సంచా కాల్చకండి’అనే క్యాంపెయిన్ ను ఢిల్లీ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

You may also like

Leave a Comment