తెలంగాణ(Telangana)లో బోగస్ కార్డుల ఏరివేతకు చేపట్టిన రేషన్ కార్డుల(Ration Cards) ఈకేవైసీ(E-KYC) ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, దీనికి ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలుంది. జనవరి 31వరకు ఈకేవైసీ అప్డేట్ చేయకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రెండు నెలలుగా రేషన్ షాపుల్లో E- KYC అప్డేట్ చేస్తున్నారు. KYC అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ, వేలిముద్రలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులను తగ్గించే అవకాశం ఉంది. దీంతో రేషన్ లబ్ధిదారులు జనవరి 31లోగా తమ రేషన్ కార్డు, ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది.
కానీ బోగస్ రేషన్ కార్డులను ఆధార్ నంబర్‌తో రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలని ఏరివేత సంస్థ నిర్ణయించింది. పాత కార్డుల్లో మృతుల పేర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపిల్లల పేర్లు అలాగే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈకేవైసీ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. కుటుంబంలో చాలా మంది లబ్ధిదారులు ఉంటే, వారందరూ ఈకేవైసీ చేయాలి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.