Telugu News » Renuka Chowdhury : టీడీపీ ఇంకా బతికి ఉందంటే దానికి కారణం…… రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు….!

Renuka Chowdhury : టీడీపీ ఇంకా బతికి ఉందంటే దానికి కారణం…… రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు….!

టీడీపీ (TDP) ఇన్ని సంవత్సరాల పాటు అధికారంలో లేకపోయినా ఇప్పటికీ ఆ పార్టీ ఇంకా ఉనికిలో ఉందంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన క్రమశిక్షణా, స్పూర్తి అని తెలిపారు.

by Ramu
renuka chowdhury says chandrababu naidu and revanth reddy are excelling as cms with the skills taught by ntr

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ (TDP) ఇన్ని సంవత్సరాల పాటు అధికారంలో లేకపోయినా ఇప్పటికీ ఆ పార్టీ ఇంకా ఉనికిలో ఉందంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన క్రమశిక్షణా, స్పూర్తి అని తెలిపారు.

renuka chowdhury says chandrababu naidu and revanth reddy are excelling as cms with the skills taught by ntr

రాజకీయాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు, గోడలు మారవచ్చు గానీ పునాది మాత్రం మారదని వెల్లడించారు. సీఎంలుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం వల్లేనని కొనియాడారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తన లాంటి చాలా మందిని రాజకీయాల్లోకి ఎన్టీఆర్ తీసుకొచ్చారని గుర్తు చేశారు.

తన పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా అని ఎన్టీఆర్ అనే వారని పేర్కొన్నారు. టీడీపీ మద్దతుతో రాష్ట్రంలో పదేండ్ల రాక్షస పాలనకు ముగింపు పలికామని, బీఆర్ఎస్ నేతలను ఇంటికి తరిమివేశామన్నారు. తాను ఈ జిల్లా ఆడబిడ్డనని చెప్పారు. తనకు కొత్త కొత్త బిరుదులు ఇచ్చి ఈ ప్రాంతానికి తనను దూరం చేయవద్దని కోరారు.

కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వర్ధంతి సభలో తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అయోధ్య రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అయోధ్యలో రామ మందిరం పూర్తి కాకున్నా 22న హడావుడిగా ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

You may also like

Leave a Comment