Telugu News » Shaheed Baji Rout: బ్రిటీష్ ను ఎదిరించిన చిచ్చర పిడుగు షహీద్ బాజీ రౌట్…!

Shaheed Baji Rout: బ్రిటీష్ ను ఎదిరించిన చిచ్చర పిడుగు షహీద్ బాజీ రౌట్…!

పన్నేండ్ల వయస్సులోనే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగాడు. చివరికి బ్రిటీష్ వారి తూటాలకు బలయ్యాడు.

by Ramu

షహీద్ బాజీ రౌట్ (Shaheed Baji Rout)… పసితనంలోనే పోరు పాఠాలు నేర్చాడు. దేశ స్వాతంత్ర్యం గురించి కలలు కన్నాడు. అందుకే అతి చిన్న వయసులోనే బనార్ సేన (Banar Sena) లో సభ్యుడిగా చేరాడు. పన్నేండ్ల వయస్సులోనే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగాడు. చివరికి బ్రిటీష్ వారి తూటాలకు బలయ్యాడు. ఆయన త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరిట ‘బాజీ రౌట్’ఫుట్ బాల్ టోర్నీని నిర్వహిస్తోందంటే ఆయన ఎంతటి దేశ భక్తుడో తెలుస్తోంది.

ఒడిశాలోని నిలకంఠపూర్ గ్రామంలో షహీద్ బాజీ రౌట్ జన్మించాడు. ఐదేండ్ల వయసులోనే బాజీ రౌట్ తండ్రిని కోల్పోయాడు. పడవ నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. పేదరికం వల్ల చిన్నప్పటి నుంచి చదువుకోలేక పోయినా పోరుపాఠాలు నేర్చుకున్నాడు.

బనార్ సేనలో చేరి బ్రహ్మణి నది వద్ద కాపలా దారుడిగా ఉండి బ్రిటీష్ సేనల కదలికలపై విప్లవ కారులకు సమాచారం అందించేవాడు. పడవలో తమను బ్రహ్మణి నదిని దాటించాలన్న బ్రిటీష్ వారి ఆజ్ఞను ధిక్కరించాడు. చివరకు ఆంగ్లేయుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో బాజీ రౌట్ పై ఆంగ్లేయ సైనికులు కాల్పులు జరపగా మరణించాడు.

షాజీ రౌట్ అంత్యక్రియల గురించి వివరిస్తూ….. అవి చితి మంటలు కాదు… దేశం నిరాశ అనే చీకట్లలొ మగ్గి పోతున్నప్పుడు అది మన స్వేచ్ఛను గుర్తు చేసే వెలుగు అని వివరించారు. అది మన స్వాతంత్ర్య అగ్ని అని జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సచింద్ర రౌత్రేయ్ అద్బుతమైన కవిత రాశారు.

You may also like

Leave a Comment