బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ (Rishi Sunak) ఇజ్రాయెల్ చేరుకున్నారు. హమాస్ (Hamas) మిలిటెంట్లతో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ లో పరిస్థితులపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో రిషి సునాక్ చర్చిచనున్నారు. ఇజ్రాయెల్ (Israel) చేరుకున్న విషయాన్ని రిషీ సునాక్ ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్)లో వెల్లడించారు.
తాను ప్రస్తుతం ఇజ్రాయెల్ లో ఉన్నట్టు రిషి సునాక్ వెల్లడించారు. ఇజ్రాయెల్ లో పరిస్థితులను చూసి తాను ఆవేదన చెందానన్నారు. ఉగ్రవాదంపై వ్యతిరేక పోరులో తాను ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలబడుతానని తెలిపారు. ఇజ్రాయెల్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
ఇజ్రాయెల్ పర్యటనకు ముందు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ప్రధాని రిషి సునాక్ ఈ రోజు ఇజ్రాయెల్ లో పర్యటిస్తారని వెల్లడించింది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో మృతులకు ఆయన సంతాపం ప్రకటిస్తారని పేర్కొంది. అంతకు ముందు బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ లో పర్యటించారు.
విమానాశ్రయంలో బైడెన్ కు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్, ఆ దేశ ప్రధాని నెతన్యాహులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టెల్ అవీవ్‌లో అధ్యక్షుడు, ప్రధానులతో సమావేశమయ్యారు. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.