డ్రైవర్ నిద్రమత్తు ఏడుగురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. పండగ పూట ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి చెందడంతో బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు మరణించారు. రోహతాస్ జిల్లా శివసాగర్ లోని పఖ్వారి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
జార్ఖండ్ లోని రాంచీ నుంచి తమ గ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. దీంతో జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని వెనక నుంచి అతి వేగంగా ఢీకొట్టాడు. దీంతో స్కార్పియో నుజ్జు నుజ్జయ్యింది. దీంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులంతా కైమూర్‌లోని కుడారి గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరంతా …జార్ఖండ్‌లోని రాంచీ నుండి తమ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగే సమయంలో స్కార్పియో వాహనంలో మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో 7గురు అక్కడిక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కైమూర్ జిల్లాలోని సవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడారి గ్రామస్థులు. వాహనంలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వారిని సదర్ ఆసుపత్రిలో చేర్చారు.
సమాచారం ప్రకారం, స్కార్పియోలో ఉన్న వారందరూ బోద్‌గయా నుండి కైమూర్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.