Telugu News » Rohit Sharma : హిట్ మ్యాన్ ‘సిక్సర్ల’ సునామీ…. మరో రెండు రికార్డులు బద్దలు….!

Rohit Sharma : హిట్ మ్యాన్ ‘సిక్సర్ల’ సునామీ…. మరో రెండు రికార్డులు బద్దలు….!

తాజాగా ప్రపంచ కప్‌లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే అత్యధిక సిక్సుల రికార్డు కావడం విశేషం.

by Ramu

ప్రపంచ కప్‌ (World Cup)లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohith Sharma) విధ్వంసం సృష్టిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ప్రపంచ కప్‌లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే అత్యధిక సిక్సుల రికార్డు కావడం విశేషం.

అంతకు ముందు ఈ రికార్డు విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. ప్రపంచ కప్‌లో క్రిస్ గేల్ మొత్తం 49 సిక్సర్లు కొట్టాడు. డివిలీర్స్ 37, రికీ పాంటింగ్ 31, మెక‌ల్ల‌మ్ 29 సిక్స‌ర్ల‌తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. మరోవైపు హిట్ మ్యాన్ మరో రికార్డు సృష్టించాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.

అంతకు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2015 ప్రపంచ కప్‌లో క్రిస్ గేల్ అత్యధికంగా 26 సిక్సులు కొట్టాడు. తాజాగా ఈ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 28 సిక్సులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. మోర్గాన్ (22(, మ్యాక్స్ వెల్ (22), డివిల్లియర్స్ (21), డీ కాక్ (21) సిక్సులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరోవైపు కివీస్ జట్టుపై భారత బ్యాటర్లు విరుచుకు పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం… భారత్ 30 ఓవర్లలో 215 పరుగులు చేసింది. ఓపెన్లు రోహిత్ శర్మ 47 పరుగులు చేసి ఔట్ కాగా, శుభమన్ గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 69, శ్రేయస్ అయ్యర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

You may also like

Leave a Comment