నారా బ్రాహ్మణి (Nara Brahmani) కి మంత్రి రోజా (Roja) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ (Skill Development Scam)లో దొరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు (Chandra Babu) భార్య, ఆయన కోడలు బ్రాహ్మణి గంట కొట్టండి, విజిల్స్ వేసి జగన్ (Cm Jangan) కు బుద్ది చెప్పండని అంటున్నారంటూ మండిపడ్డారు.
బ్రాహ్మణి తెలియక మాట్లాడుతోందో లేదా తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తోందా అంటూ ఆమె ప్రశ్నించారు. బ్రహ్మణితో సహా ఆమె కుటుంబ సభ్యులందరూ ప్రజల సొమ్ము తిన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పెద్ద సైకోలు మీ నాన్న బాలకృష్ణ , మీ మామ చంద్రబాబ అంటూ బ్రహ్మణిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ గురించి ఇంకోసారి మాట్లాడితే బ్రహ్మణికి మర్యాద దక్కదంటూ మండిపడ్డారు.
ఇన్ని రోజులు నువ్వు రాజకీయం గురించి మాట్లాడలేదన్నారు. అందుకే తాను మాట్లాడలేదన్నారు. హైదరాబాద్ కే పరిమితమైన మిమ్మల్ని ప్రజలు మళ్లీ ఏపీలోకి రాకుండా చేస్తారంటూ ధ్వజమెత్తారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోని చంద్రబాబు ఊదర గొట్టారన్నారు. తమ కన్నా తోపులు లేరని పచ్చ ఛానల్లో చంద్రబాబు పబ్లిసిటీ చేసుకున్నారన్నారు.
అంతే కానీ ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం ఏనాడైనా బాబు ఆలోచించారా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్న సమయంలో చంద్రబాబుకు ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. ఆ ఐదేండ్లలో ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారంటూ ఆరోపణలు చేశారు.