ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi cm kejiriwal)కు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. జైలు నుంచే పలు లేఖలు విడుదల చేస్తూ ఆయన ఢిల్లీ ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారు. అయితే, ఆయన జైలు నుంచి పరిపాలన చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
ఇకపోతే తన జ్యుడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారో దానికి సంబంధించి సాక్ష్యాధారాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయంటూ న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆయనకు మరో చాన్స్ లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు(Legal opinions) తీసుకునేందుకు సమయం(Time Duration) పెంచాలంటూ స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.ప్రస్తుతం వారంలో రెండుగా ఉన్న లీగల్ మీట్స్ ఐదు(Five times)కు పెంచాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం కేజ్రీవాల్ తన లాయర్‌ను కలిసేందుకు వారానికి రెండు సార్లు అవకాశం ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే, ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో కోరగా..కేజ్రీవాల్ పిటిషన్ స్పెషల్ కోర్టు కొట్టివేసింది.