కాంగ్రెస్ పార్టీ (Congress Party) మీద తనకు ఎలాంటి భ్రమలు లేవని, అలాంటివి ఉంటే నేను ఐపీఎస్ (IPS) కి రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెసులోనే చేరే వాడినని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రవీణ్ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ కాంగ్రెస్ నేత, పీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్ చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ ప్రవీణ్ ఈ కామెంట్ చేశారు.
బీఎస్ పీ కండువా కప్పుకున్న ఆర్ ఎస్ ప్రవీణ్ చాలా కష్టపడుతున్నారనీ అయినప్పటికీ శ్రమ వృధా అయిపోతోందని, ప్రవీణ్ కాంగ్రెస్ లోకి వస్తే తప్ప తన లక్ష్యం నేరవేరదని కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ అన్న విషయం తెలిసిందే. తనకు బీఎస్పీలో చేరి చేస్తున్న పోరాటం తనకు అత్యంత ఇష్టమని ప్రవీణ్ కుమార్ అన్నారు. తన పోరాటమంతా దోపిడి వర్గాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వల్ల బహుజన వర్గాలకు, బెల్లయ్య నాయక్ లాంటి పోరాట యోధులకు అనాదిగా జరుగుతున్న అన్యాయం గురించే అని తెలిపారు.
కాంగ్రెసుకు మూడు చెరువుల నీళ్లు తాగించి, యూపీలో మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవ్వడాన్ని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు.
తమ పోరాటం మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, నాయక్ లాంటి కాంగ్రెస్ వాదులంతా మా పార్టీలోకి చేరితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందనిన్నారు. అలా జరిగినప్పుడే కొందరి పాలైన తెలంగాణను అందరి తెలంగాణ చేసినవాళ్లం అవుతామన్నారు.