రాష్ట్రంలో దళితుల ఎందుకు వెనుకబాటు తనానికి గురయ్యారో అందుకు గల కారణాలను బీఆర్ఎస్(BRS) పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసిన మహాత్మ జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రస్తుత సమాజంలో దళితులు అభ్యున్నతికి అన్ని అవకాశాలు ఉన్నా వారు ఇంకా ఎందుకు ఎదగడం లేదు. వారికి సమాజంలో ఎందుకు సముచిత స్థానం లభించం లేదు అనే ప్రశ్న అందరి మదిని తోలుస్తుంది. అందుకు గల కారణం ఏమిటో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరించే ప్రయత్నంచేశాడు.
‘విద్య లేక వివేకం లేదు.. వివేకం లేక నీతి లేదు.. నీతి లేక పురోగతి లేదు.. పురోగతి లేక విత్తం లేదు.. విత్తం లేకనే శూద్రులు అదోగతి పాలయ్యారు. వీటిన్నింటికి కారణం విద్య లేకపోవడం అని నమ్మి సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన మహత్మ జ్యోతిబా ఫూలేకు జయంతి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
విద్య లేక వివేకం లేదు
వివేకం లేక నీతి లేదు
నీతి లేక పురోగతి లేదు
పురోగతి లేక విత్తం లేదు
విత్తం లేకనే శూద్రులు అదోఃగతి పాలయ్యారు
వీటన్నిటికీ కారణం విద్య లేకపోవడం అని నమ్మి సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి సామాజికన్యాయం కోసం పోరాడిన మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి శుభాకాంక్షలు… pic.twitter.com/oA9wgvvp3Y— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 11, 2024
ఆర్ఎస్పీ చెప్పిన విధంగానే చాలా మందికి విద్య లేక వివేకాన్ని కోల్పోతున్నారు. ఎక్కడైతే నీతి ఉండదో అక్కడ అభివృద్ధి అనేది సాధ్యం కాదు. పురోగతి అనేది లేకపోతే ఆర్థిక పరిపుష్టి, సామాజిక న్యాయం అనేది కూడా సాధ్యం కాదు అనేది ఆయన పోస్టులోని సారాంశం. కాగా, ఆర్ఎస్పీ పోస్టు పలువురిని ఆలోచింపజేసేదిగా ఉన్నా.. ఆయన ఇటీవల తీసుకున్న నిర్ణయం వలన బహుజన సంఘాలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.