Telugu News » Bad Principal : అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్…!

Bad Principal : అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్…!

సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లు గాడితప్పుతున్నారు. విద్యార్థునుల పట్ల విధం చెడుతున్నారు.

by sai krishna

సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లు గాడితప్పుతున్నారు. విద్యార్థునుల పట్ల విధం చెడుతున్నారు. హకీంపేట(Hakimpet)లో స్పోర్ట్స్(Sports)ఓఎస్డీ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరవక ముందే…రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో మరో ప్రిన్సిపాల్ పదవ తరగతి విద్యార్థునుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.


భయ భ్రాంతులకు గురైన విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.వారు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్ దేవ్పల్లి(Mylar Devpalli) పోలీస్స్టేషన్పరిధిలోని కాటేదాన్ రాకేష్ విద్యా నికేతన్ స్కూల్ప్రిన్సిపల్ శంకర్ పదో తరగతి విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థిని తల్లిదండ్రలు ఆరోపించారు.

ఇదే విషయంపై ప్రిన్సిపాల్ని నిలదీయగా అతను స్పందించలేదు. ఆయన ప్రవర్తనతో విసుగెత్తిన పేరెంట్స్ షీ టీం కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

You may also like

Leave a Comment