Telugu News » Vemula wada : లేడీసే కదా ఈజీగా బంగారం కొట్టేయొచ్చు అనుకున్నాడు…కానీ.!?

Vemula wada : లేడీసే కదా ఈజీగా బంగారం కొట్టేయొచ్చు అనుకున్నాడు…కానీ.!?

దొంగలు(thieves)బాగా బరితెగించారు.ఒకప్పుడు శివారు ప్రాంతాల్లోని ఒంటరి మహిళల్ని బెదిరించి బంగారం దోచుకునే క్రిమినల్స్ కాస్తా..మరో అడుగు ముందుకేసి ఇళ్లళ్లోకి చొరబడుతున్నారు.

by sai krishna

దొంగలు(thieves)బాగా బరితెగించారు.ఒకప్పుడు శివారు ప్రాంతాల్లోని ఒంటరి మహిళల్ని బెదిరించి బంగారం దోచుకునే క్రిమినల్స్ కాస్తా..మరో అడుగు ముందుకేసి ఇళ్లళ్లోకి చొరబడుతున్నారు.ఇటీవల సిరిసిల్ల జిల్లా(Sirisilla District) వేములవాడ (Vemulawada) పట్టణంలోని ఓ దుండగుడు మహిళ మెడలో నుంచి నగలు అపహరించేందుకు ప్రయత్నించాడు.


ఆమె ధైర్యంగా ప్రతిఘటించడంతో చేతికి చిక్కిన 7 గ్రాముల చైన్తో ఆగంతకుడు పరారయ్యాడు.ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వేములవాడ పట్టణంలోని భగవంత రావు నగర్(Bhagwanta Rao Nagar)లో వేకువ జామున పిల్లి శ్రీలత ఇంటి ఆవరణలో చీకట్లో నక్కిన ఆగంతకుడు దాడికి యత్నించాడు.

దొంగ నుంచి తప్పించుకొని ధైర్యంగా ఆమె ప్రతిఘటించారు. పెనుగులాటలో ఏడు గ్రాముల బంగారు చైన్ దుండగుడు లాకెళ్లాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment