ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) దుమ్ము లేపుతున్నాడు. ఈ వన్డే వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో 101 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీ 49వ సెంచరీ చేశాడు. దీంతో సచిన్ (Sachin Tendulkar) రికార్డును కోహ్లీ సమం చేశాడు.
తన రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. అద్భుతమైన రికార్డును అందుకన్న కోహ్లీని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. వెల్ ప్లేయిడ్ విరాట్ జీ అంటూ సచిన్ కొనియాడారు. 49 నుంచి 50 సెంచరీలు చేరుకునేందుకు తనకు 365 రోజులు పట్టిందన్నారు.
కానీ నువ్వు మాత్రం కొద్ది రోజుల్లోనే 49 నుంచి 50 రికార్డులు చేరుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన రికార్డును కోహ్లీ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. కంగ్రాట్స్ కోహ్లీ అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. దీనిపై అటు క్రికెట్ అభిమానులు సైతం విరాట్ కోహ్లీని ప్రశంసిస్తున్నారు.
ఇది ఇలా వుంటే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. వరుసగా ఏడు విజయాలతో భారత్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో తడబడిని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 83 పరుగులు చేసి ఆలౌట్ అయింది.