‘హిందూ మతం అంటే ఏమిటి.?’అన్న ప్రశ్నకు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Jaggi Vasudev) ఆసక్తికర సమాధానం (Intresting Answer) ఇచ్చారు. హిమాలయాలు (Himalayas), హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న భూభాగంలో నివసించే వారిని హిందువులుగా పరిగణిస్తారని చెప్పారు. కాల క్రమేణా ఇక్కడ నివసించిన ప్రజలే సహజ హిందువులుగా మారారని అన్నారు.
ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ లేదా హిందువుల భూమిగా పిలుస్తారని చెప్పారు. హిందు ఇజం అనేది ఒక మతం కాదని ఆయన వెల్లడించారు. హిందువు అనగా ఒక భూమి ఆయన వెల్లడించారు. ఆ తర్వాత కాల క్రమేణ అది ఒక గొప్ప నాగరికతగా మారందని చెప్పారు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అధికార ఘర్షణల నేపథ్యంలో వక్రీకరణకు గురవతూ వచ్చిందన్నారు.
నాగరికత అనేది నిర్భయ, అపరాధం లేని మానవుల పరిణామని పేర్కొన్నారు. వాస్తవానికి నాగరికత అనేది ఒకే నమ్మకమని చెప్పారు. ప్రస్తుత మానవ మేధస్సు, వందల ఏళ్ల క్రితం నాటి కంటే కచ్చితంగా అత్యంత మెరుగ్గా ఉందన్నారు. దీనికి కారణం తమ జీవితాన్ని సక్రమంగా నిర్వహించాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.
తెలియని భయాలు, అపరాధం, దురాశ నుంచి బయటకు వచ్చినప్పడు మీరు హిందువులు అవుతారన్నారు. హిందువులంటే ఒక నిర్ధిష్ట రకమైన వ్యక్తులు కాదన్నారు. దానిని సనాతన ధర్మం అంటారని వెల్లడించారు. సనాతన అనగా శాశ్వతమని అర్థమన్నారు. ధర్మం అంటే మతం కాదని అది ఒక చట్టమన్నారు. కాబట్టి శాశ్వతమైన చట్టం అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు మనమంతా చాలా భిన్నంగా వున్నామన్నారు. కానీ ప్రతి ఒక్కరూ చివరికి ఈ మట్టిలో కలిసిపోవాల్సిందేనన్నారు.