సంయుక్త మీనన్ టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు పొందింది. బింబిసార, సార్, విరూపాక్ష వంటి వరుస హిట్లలో సంయుక్త మీనన్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ క్రేజీ బ్యూటీ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సంయుక్త నెక్ట్స్ మూవీ ‘డెవిల్’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ సినిమా మేకర్స్ రిలీజ్ చేశారు.
తెలుగు తెరకు ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ పరిచయం అయ్యింది. భీమ్లా నాయక్ తో కలిపి సంయుక్త నటించిన నాలుగు సినిమాలు తెలుగులో హిట్ కావడంతో ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.
డెవిల్ మూవీలో కళ్యాణ్ రామ్ హిరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఈ సినిమా టైటిల్ కు ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు మేకర్స్.
ఈ చిత్రంలో సంయుక్త పోషించిన వైవిధ్యమైన పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 11న సంయుక్త మీనన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె గెటప్ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. గుడికి వెళ్తున్న ఓ అమ్మాయి తన చేతిలో కొబ్బరికాయ, పువ్వులు పట్టుకుని వెళ్తున్నట్లు చాలా ప్లెజెంట్ గా ఉంది ఈ ఫస్ట్ లుక్ స్టిల్. అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ కు కంప్లిమెంట్స్ వస్తున్నాయి. నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.