Telugu News » Yogi Adityanath : సనాతన ధర్మం ఒక్కటే మతం, మిగతావన్నీ….. సీఎం యోగీ ఆసక్తికర వ్యాఖ్యలు……!

Yogi Adityanath : సనాతన ధర్మం ఒక్కటే మతం, మిగతావన్నీ….. సీఎం యోగీ ఆసక్తికర వ్యాఖ్యలు……!

సనాతన ధర్మం అనేది మానవత్వాని (Humanity)కి చెందిన మతం అని అన్నారు.

by Ramu
yogi

యూపీ (UP) సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం (Sanathana Dharma) ఒక్కటే మతమన్నారు. మిగిలినవన్నీ వర్గాలు లేదా పూజా విధానాలని తెలిపారు. సనాతన ధర్మం అనేది మానవత్వాని (Humanity)కి చెందిన మతం అని అన్నారు. అలాంటి మతం మీద దాడి జరిగితే మానవత్వం ప్రమాదంలో పడుతుందని చెప్పారు.

 

మహా దిగ్విజయ్ నాథ్ 54వ వర్ధంతి, మహా అవైద్యనాథ్ తొమ్మిద వర్ధంతి సందర్బంగా గోరఖ్ పూర్‌లో ఏడు రోజుల పాటు యజ్ఞాలను నిర్వహించారు. చివరి రోజు గోరఖ్ పూర్ ఆలయంలో నిర్వహించిన ‘శ్రీమద్ భగవత్ కథా జ్ఞాన్ యజ్ఞ’ ముగింపు కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్య నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

ఆలయంలో ఈ ఏడు రోజుల పాటు వినే భగవద్గీత బోధనలు భక్తుల జీవితాల్లో సానుకూలమైన మార్పులను తీసుకు వస్తుందని సీఎం యోగీ అన్నారు. భగవద్గీత అనేది అనంతమైనదన్నారు. దాన్ని నిర్ధిష్టమైన రోజులు లేదా గంటలకే పరమితం చేయకూడదని సూచించారు. భగవద్గీత జ్ఞానం అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందన్నారు.

భగవద్గీత సారాన్ని భక్తులు నిరంతరం తమ జీవితాల్లో గ్రహిస్తారని చెప్పారు. శ్రీమద్ భగవత్ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ఓపెన్ మైండ్‌సెట్ ఉండాలన్నారు. భారతీయుడిగా పుట్టడం చాలా గర్వకారణమని యోగి తెలిపారు. భారతదేశంలో పుట్టడం చాలా అరుదని పేర్కొన్నారు, మనిషిగా పుట్టడం అంతకంటే చాలా అరుదని సీఎం అన్నారు.

You may also like

Leave a Comment