Telugu News » నక్సల్ నుంచి ఎమ్మెల్యే… ఇప్పుడు ఏకంగా మంత్రి… ఈమె పొలిటికల్ జర్నీ ఇదే…!

నక్సల్ నుంచి ఎమ్మెల్యే… ఇప్పుడు ఏకంగా మంత్రి… ఈమె పొలిటికల్ జర్నీ ఇదే…!

by Sravya

సీతక్క గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఈమె గురించి తెలియని వారు ఉండరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు ధనసరి అనసూయ సీతక్క. ఈమెకి 52 ఏళ్ళు. పొలిటికల్ సైన్స్ లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈమె పీహెచ్డీ పూర్తి చేసారు. ఈమె ఇది వరకు జనశక్తి గ్రూపులో దళ సభ్యురాలుగా ఉండేవారు శ్రీరాముని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళు విడిపోయారు.

సుమారు రెండు దశాబ్దాల పాటు ఈమె మావోయిస్టుల పార్టీలో పని చేసింది. సీతక్క జనజీవన స్రవంతికి వచ్చేసారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి చదువుకున్నారు కూడా. తెలుగుదేశం పార్టీ తరఫున 2004లో ములుగు నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2009లో ఈమె వీరయ్య మీద గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Also read:

2014లో ఈమె టిడిపి తరఫున పోటీ చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018లో సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు ములుగు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కరోనా సమయంలో సీతక్క మారుమూల పల్లె కి కూడా వెళ్లి ఆహార పదార్థాలను ఇచ్చారు నాగారం మండలం కొట్టాయి గ్రామమంతా కూడా వరద నీటితో నిండి పోతే సీతక్క చూడలేక రక్షించడానికి హెలికాప్టర్ పంపాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈమె ఇప్పుడు తాజాగా మంత్రి పదవిని పొందారు.

You may also like

Leave a Comment