Telugu News » Harrassment : లైంగిక వేధింపులు.. ఎలక్షన్ ఆఫీసర్ చెంపచెల్లుమనిపించిన మహిళ!

Harrassment : లైంగిక వేధింపులు.. ఎలక్షన్ ఆఫీసర్ చెంపచెల్లుమనిపించిన మహిళ!

ఓ అధికారి తన స్థాయిని మరిచి ప్రవర్తించాడు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి అందుకు భిన్నంగా, సభ్యసమాజం తలదించుకునేలా తోటి మహిళా ఉద్యోగినితో ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇంతకు ఆ అధికారి ఎవరు? ఏం చేశాడు.. అందుకు ఆ మహిళా అధికారిణి అతనికి ఎటువంటి బుద్ది చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

by Sai

Sexual harassment.. Election officer slapped the woman!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ఓ మహిళ అధికారిణి(Sexual Harrassment)తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తన మొబైల్‌లో ఆమె ఫొటోలు, వీడియోలు(PICS and Videos) తీసి ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు.

కొంతకాలంగా మౌనంగా భరిస్తూ వస్తున్న మహిళ ఒక్కసారిగా తన సహనాన్ని పక్కనబెట్టి అతనికి బుద్ది చెప్పాలని భావించింది. ఈ క్రమంలోనే అధికారి వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతని చెంప చెల్లుమనిపించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, బాధిత మహిళ అధికారి వేధింపుల గురించి తన భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు. ఆ అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment