Telugu News » KU students : మాకు వసతేది వీసీ గారు…!?

KU students : మాకు వసతేది వీసీ గారు…!?

దయనీయమైన పరిస్థితుల్లోనే చదువులు కొనసాగిస్తున్నారు కేయూ ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ (KU SFC )విద్యార్థులు ( Students).

by sai krishna

– కేయూలో ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ స్టూడెంట్ల వెతలు
– హాస్టల్ కోసం గేటు ఎదుట ధర్నా
– రోడ్డుపైనే కూర్చొని భోజనాలు
– వీసీ, రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ కు వ్యతిరేకంగా ప్లకార్డులు

ఇంటికి చుట్టం వస్తే ఒకరోజు, రెండు రోజులు. తర్వాత ఉన్నా కొట్టేలాగే చూస్తారు. ఆత్మగౌరవాన్ని పక్కన బెట్టి ఉండాలని చూసినా క్షణమొక యుగంలా గడుస్తుంది. తర్వాత మొదటికే మోసం వస్తుంది. చుట్టం శత్రువైపోతాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సంవత్సరమంతా చదవాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.!? అవును, ఈ దయనీయమైన పరిస్థితుల్లోనే చదువులు కొనసాగిస్తున్నారు కేయూ ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ (KU SFC )విద్యార్థులు ( Students).హాస్టల్ (Hostel ) వసతి కల్పిస్తామన్న వారు.. విద్యా సంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో పరిస్థితి దుర్భరంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పటి వరకూ సీనియర్స్ గదుల్లో తలదాచుకుంటూ వచ్చారు. అయితే.. ఇప్పుడు ఆ సీనియర్స్ కూడా వారిని వెలివేశారు. తమ గదుల్లోంచి నిర్దాక్షణ్యంగా జూనియర్ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టారు.

నలుగురు పట్టే గదుల్లో పదిమంది తలదాచుకుంటూ ఉండడంతో సీనియర్లు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరుకు గదుల్లో తమ చదువులెలా సాగుతాయని సీనియర్స్ వాపోతున్నారు. మరోవైపు ఆశ్రయం పొందుతున్న జూనియర్ విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం.. కనీసం వీరికి తలదాచుకునేందుకు వసతి గదులు కూడా లేవు. ఇప్పటి దాకా ఆశ్రయం ఇచ్చిన సీనియర్లు బయటకు వెళ్లగొట్టడంతో సహనం నశించిన జూనియర్ విద్యార్థులు ధర్నాకు(Dharna) దిగారు. తమకు హాస్టల్‌‌‌‌‌‌‌‌ కేటాయించాలంటూ యూనివర్సిటీ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. వీసీ(vice chancellor ), రిజిస్ట్రార్‌(Registrar) ‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని, రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు గో బ్యాక్‌(Police go back)‌‌‌‌‌‌‌ అంటూ స్టూడెంట్లు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి స్టూడెంట్లకు మద్దతు ప్రకటించారు. ఇంత జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు రోడ్డుపైనే (students sitting on roads ) కూర్చొని భోజనాలు చేసి తమ నిరసనను తెలియజేశారు.

తెలంగాణ కోసం విద్యార్ధులు ఎంతగా పోరాటం చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో చదువుకునేందుకు వసతి గృహాలు కరువు అవడం.. హమీలు గుప్పించిన ప్రభుత్వం వారి బాగోగులు పట్టించుకోవటంలో విఫలం అవడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. బంగారు తెలంగాణ అంటూ మంత్రుల నుంచి ముఖ్యమంత్రి(Chief minister) దాకా గొప్పలు చెప్పడం కాదు..ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

You may also like

Leave a Comment