కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ ఎమ్మెల్యే మాండ్య రవి గౌడ్ (Mandya Ravi Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేండ్ల తర్వాత సీఎం సిద్దరామయ్య పదవీ కాలం ముగుస్తుందని తెలిపారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ సీఎం అవుతారని తెలిపారు. ఇందులో రెండో మాటలకు అవకాశమే లేదని ఆయన వెల్లడించారు.
పార్టీ కోసం డీకే శివకుమార్ ఎంతో కష్టపడ్డారని ఆయన వెల్లడించారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు. మీడియాలో ప్రతి పక్ష బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. అధికార మార్పిడికి సంబంధించి ముందే ఏదైనా ఒప్పందం జరిగిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ…….
అటువంటి ఏ ఒప్పందం గురించి తనకు తెలియదన్నారు. హైకమాండ్ స్థాయిలో జరిగే చర్చల గురించి తనకు తెలియదని చెప్పారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలను బట్టి సీఎం అవుతారని తెలిపారు. శివ కుమార్ ను సీఎం చేసేందుకు సిద్ద రామయ్య రాజీనామా చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ…
ఇలాంటి విషయాలను ఇప్పుడు ఎందుకు చర్చించాలి? అవి ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతానికి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కానీ. సరైన సమయం వచ్చినప్పుడు ఆ విషయంలో హై కమాండ్ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.