చెన్నై (Chennai) ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram Stadium)లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ (match)లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకొంది. ఈ మ్యాచ్ సందర్భంగా రికార్డయిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోలో పాకిస్తాన్ స్పీడ్ బౌలింగ్ మాస్టర్ షాహిన్ షా అఫ్రిది, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా కనిపించారు. ఈ వీడియోలో షాదబ్ ఖాన్‌తో, షాహిన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్.. మాట్లాడుకుంటూ రావడం రికార్డయింది.
వారిద్దరి వెనుకే ఉన్న ఇఫ్తికర్ అహ్మద్ (Iftikhar Ahmed)మాత్రం చూసే వాళ్ళకు షాకిచ్చారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తనలో తాను గట్టిగా మాట్లాడుకోవడం ఈ వీడియోలో గమనించవచ్చు.. ఈ సిచ్యువేషన్ జాగ్రత్తగా గమనిస్తే షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌తో అతను మాట్లాడుతున్నట్టు కూడా లేదు. వారిద్దరు ముందు వెళ్తోండగా.. ఇఫ్తికర్ మాత్రం వెనుక రావడం కనిపించింది. ఆ సమయంలో అతను ఎవరినో బెదిరిస్తోన్నట్టు అనిపించింది.
నిజానికి గ్రౌండ్లో ఎవరు లేరు.. ఇయర్ బడ్స్ వాడటానికి అనుమతి లేదు. ఒకవేళ ఇంటర్వ్యూలు ఇస్తూ మ్యాచ్‌లు ఆడే సందర్భం కాదు.. మరోవైపు ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లల్లో ప్లేయర్లు ఇలా మధ్యలో మాట్లాడే అనుమతి లేదు. కానీ ఇఫ్తికర్ అహ్మద్ మాత్రం ఇలా ఎవరితోనో మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
ఇఫ్తికర్ అహ్మద్ దెయ్యాలు, ఆత్మలతో మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.. ఇంతకి ఇఫ్తికర్ మాట్లాడిన ఆ ఇన్విజిబుల్ పర్సన్ ఎవరు? అంటూ ఆరా తీయడం కూడా మొదలెట్టారు నెటిజన్లు. మరోవైపు ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రదర్శనపై ఇంటా, బయట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ క్రికెటర్లు సైతం తమ ప్రదర్శన విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నట్టు కనిపిస్తోంది.