పెద్దపల్లి జిల్లా కాటారం(kataram) రెవెన్యూ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్ పోలీస్‌స్టేషన్‌లో(Mahadevpur police station) ఇటీవల ఓ రాజకీయ నాయకురాలి భర్త డ్యాన్సులు(Dances) వేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ యవ్వారం అంతా జరిగింది పోలీస్ స్టేషన్ లో అని తెలిసి పోలీసుశాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా ఎస్పీ ఆ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకివెళితే.. రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ టైంలో పోలీసులు కోడ్ ఉల్లంఘన ఎక్కడైనా జరుగుతుందా? అని పకడ్భందీగా విధులు నిర్వహించాలి. కానీ, ఓ జడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్(Srinivas) మహాదేవ్ పూర్ పోలీస్‌స్టేషన్లో సినిమా పాటకు డ్యాన్సులు చేయడం.. దానిని సిబ్బంది దగ్గరుండి ప్రోత్సహించడంతో పాటు వీడియో తీయడం వారికి చేటుచేసింది.
ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ కిరణ్ కరే(Sp kiran Kare) పూర్తి స్థాయిలో ఈ ఘటనపై విచారణ జరిపి స్టేషన్ ఎస్సై ఇద్దరు హెడ్ కానిస్టెబుల్స్, ఆరుగురు కానిస్టెబుల్స్‌ను సస్పెండ్ (Suspend) చేశారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా వీరిపై వేటు వేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఎస్సై ప్రసాద్‌ను వీఆర్ జిల్లా కేంద్రానికి బదిలీ చేయగా, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు.మరో హెడ్ కానిస్టెబుల్ ఉపేందర్‌ను ఘన్ఫూర్ పీఎస్‌కు, ఆరుగురు కానిస్టేబుల్స్ ధనుంజయని మొగుళ్లపల్లికి, అరుణ్ కుమార్‌ను రేగొండకు, ఎస్ విక్రాంత్‌ను కాటారం పీఎస్‌కు, జి కిరణ్‌ను చిట్యాలకు, జే తిరుపతిని కొయ్యూరు, పి. నాగరాజును మహాదేవ్ పూర్ సర్కిల్ ఎస్బీ కానిస్టేబుల్ గా బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు.