Telugu News » Sitaram Yechury : ఆ మిత్రులతో కలిసి దేశంలో బీజేపీ ఏమైనా చేయగలదు…!

Sitaram Yechury : ఆ మిత్రులతో కలిసి దేశంలో బీజేపీ ఏమైనా చేయగలదు…!

బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉందన్నారు.

by Ramu
sitaram yechury fire on bjp

దేశ వ్యాప్తంగా బీజేపీ (BJP) ఓటమి కోసమే తమ పోరాటమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) తెలిపారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉందన్నారు. ఒకటి, రెండు సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీదని చెప్పారు.

మోడీ సర్కార్ కు అకౌంటబిలిటీ లేదని విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ లోపించిందన్నారు. టన్నెల్ నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు టన్నెల్ కూలిన ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి? అని నిలదీశారు. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు ప్రధాని మోడీ పాల్పడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో నిలిచినా తమకు నష్టం లేదన్న భావనలో కాంగ్రెస్ ఉందన్నారు. తెలంగాణలో ఒక వేళ హంగ్‌ వస్తే బీజేపీతో బీఆర్‌ఎస్‌, కలుస్తుందన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం అందరినీ ఏకం చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

సీపీఎం పోటీలో లేని చోట ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్‌కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హంగ్‌ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ కొంత బలంగా కనిపిస్తోందని, కానీ అది ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని అన్నారు.

పొలిటికల్ బాండ్ల పేరిట రాజకీయ పార్టీలు లీగల్‌గా అవినీతికి పాల్పడుతున్నాయన్నారు. పొలిటికల్ పార్టీల ఖర్చుపై ఒక పరిమితి ఉండాలని సూచించారు.మణిపూర్ ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని తెలిపారు. గవర్నర్ల తీరుపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని విమర్శలు గుప్పించారు. బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షాలు ఈడీ, సీబీఐ అని అన్నారు.. ఆ మిత్రులతో కలిసి బీజేపీ దేశంలో ఏదైనా చేయగలదన్నారు.

You may also like

Leave a Comment