Telugu News » Skill Development case: చంద్రబాబుపై ఆర్జీవీ ట్వీట్

Skill Development case: చంద్రబాబుపై ఆర్జీవీ ట్వీట్

“ఏ టన్ ఆఫ్ స్టీల్ + 420 టన్స్ ఆఫ్ ఫ్రాడ్ = స్కిల్ క్రిమినల్” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, టీడీపీ, ఆ పార్టీ నాయకులపై ఆర్టీజీ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికలపై స్పందిస్తూనే ఉంటారు.

by Prasanna
RGV

స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development case)కేసులో చంద్రబాబు (Chandrababu) భవితవ్యం ఏమవుతుంది అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చంద్రబాబుకి, జైలా? బెయిలా? అనే చర్చే ఎటు చూసినా నడుస్తోంది. ఈ కేసుపై వివాదస్పద దర్శకుడిగా పేరు పొందిన రామ్ గోపాల్ వర్మ (RGV) కూడా స్పందించారు.

RGV

“ఏ టన్ ఆఫ్ స్టీల్ + 420 టన్స్ ఆఫ్ ఫ్రాడ్ = స్కిల్ క్రిమినల్” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, టీడీపీ, ఆ పార్టీ నాయకులపై ఆర్జీవీ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికలపై స్పందిస్తూనే ఉంటారు.

చాలా వరకు ఆయన ట్వీట్లు, కొన్ని విషయాలపై ఆయన స్పందనలు పెద్దగా అర్థం కావు. ఆ విషయాన్ని తనేమి పట్టించుకోనని, తనకు ఏం చెప్పాలని అనిపిస్తే అదే చెప్తానంటూ ఆర్జీవీ చెప్తూ ఉంటారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో ఆయన స్పందన కూడా అలాగే ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తపరిచారు.

ఆర్జీవీ వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం, టీడీపీకి వ్యతిరేకంగా స్పందిస్తుండటం చూస్తుంటాం. ఆయన తీసిన కొన్ని పొలిటికల్ సినిమాలు కూడా ఇదే ధోరణిలో ఉంటాయి. తాజాగా వ్యూహం పేరుతో ఆయన తీస్తున్న సినిమా వైసీపీకి అనుకూలంగా ఉంటుందని, అది ఎన్నికల్లో వైసీపీకి ఉపయోగకరంగానూ, టీడీపీకి వ్యతిరేకంగా పని చేసే విధంగా రూపొందిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

You may also like

Leave a Comment