పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు(parliament special session) చాలా తక్కువ సమయే వున్నప్పటికీ ఇందులో చారిత్రక నిర్ణయాలు(Historical decisions) వుంటాయని ప్రధాని మోడీ(pm modi) అన్నారు. 75 ఏళ్ల ప్రయాణం కొత్త గమ్యం నుంచి ప్రారంభం కావడం ఈ సెషన్ కు వున్న ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.
దేశంలో అభివృద్ధి అనేది నిర్విఘ్నంగా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ ప్రసంగించారు.
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ శక్తీ భారత అభివృద్ధినీ అడ్డుకోలేని ఆయన తెలిపారు. జీ-20 సదస్సు చాలా అద్భుతంగా జరిగిందని చెప్పారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు జీ-20 సదస్సు మార్గదర్శనం చేసిందన్నారు. చంద్రయాన్-3 విజయంతో దేశానికి గొప్ప పేరు వచ్చిందన్నారు.
శివశక్తి పాయింట్ అనేది ఇప్పుడు కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారిందన్నారు. భారత్ ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు దిశగా ప్రయాణిస్తోందన్నారు. ఇప్పుడు కొత్త సంకల్పం దిశగా మరి కొన్ని అడుగులు పడాల్సి వుందన్నారు. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక కొత్త ఉత్సాహం కనిస్తోందన్నారు.