ఐఏఎస్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఓ డైనమిక్ ఆఫీసర్. గతంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో కలెక్టర్‌గా పని చేసి తన దైన పని తీరుతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆమె పని తీరును మెచ్చి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Governament) సీఎంలో కీలక బాధ్యతలను అప్పగించింది.
తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శిగా ఉంటూ కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను ఆమె పర్యవేక్షించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలను చేపట్టింది. ఇందులో భాగంగా సీఎంవో కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
తాజాగా స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంటల్లో నడవాల్సి వచ్చిన సమయంలో ఎలా నడుస్తున్నామనేది చాలా ముఖ్యమైన విషయమన్నారు. అప్పుడు తలపైకి ఎత్తి ధైర్యంగా, అత్యంత బలంగా నడవాలని ట్వీట్ చేశారు. ఈ పోస్టును చూసిన ఆమె అభిమానులు ట్వీట్ పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
అసలు ఏం జరిగింది మేడమ్ అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఒక మంచి అధికారి… గొప్ప సమర్థత మీకు ఉంది… ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి… మీరు వెనకడుగు వేయాల్సిన పని లేదు… ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు నవవండది అంటూ మద్దతు పలుకుతున్నారు.