Telugu News » Snake: స్కూటీలో పాము హల్చల్!

Snake: స్కూటీలో పాము హల్చల్!

షబ్బీర్ అనే వ్యక్తి తన షాప్ ముందు స్కూటీలో పాము దూరడాన్ని గమనించాడు.

by Prasanna
snake1

ఈ మధ్య కాలంలో వర్షాలు (Rains) ఎక్కువగా కురుస్తుండటంతో వాన నీటితోపాటు పాములు (Snakes) కూడా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.  చుక్క వర్షం పడితే చాలు పాముల హల్చల్ మొదలైపోతోంది. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పాము వార్తలు నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి.  తాజాగా సిరిసిల్ల (Sirisilla) జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ దగ్గర నిలిపి ఉన్న స్కూటీలో దూరిన పాము బండి యజమానిని దాదాపు రెండు గంటలు ముప్పుతిప్పలు పెట్టింది.

snake1

షబ్బీర్ అనే వ్యక్తి తన షాప్ ముందు స్కూటీలో పాము దూరడాన్ని గమనించాడు. దీంతో అప్రమత్తమయిన షబ్బీర్, పామును బయటకు రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏవీ ఫలించకపోవడంతో పక్కన ఉన్న మెకానిక్ కూ, దగ్గరలోని స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించాడు.

snake2

మెకానిక్ సహాయంతో క్యాచర్ గంటన్నర పాటు శ్రమించి బండి విడి భాగాలు ఒక్కొక్కటిగా తొలగించినా పాము ఆచూకీ దొరకలేదు. చివరికి స్కూటీ నీ స్టార్ట్ చేసి పెద్ద శబ్దం చేశారు. దీంతో ఇంజిన్ లో దాక్కున చిన్న పాము బయటకి వచ్చింది. పామును గమనించి క్యాచర్ పాము పిల్లను పట్టుకుని, జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు. జన సంచారంతో ఉండే ప్రాంతం కావడంతో స్కూటీ చట్టూ జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

You may also like

Leave a Comment