కాంగ్రెస్ (Congress) పై యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ది తాలిబన్ మైండ్ సెట్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాలిబన్ మైండ్ సెట్ కు ఒకే ఒక పరిష్కారం ఉందన్నారు. తాలిబన్లకు హనుమాన్ గదతోనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని అల్వార్ లో నిర్వహించిన ఎన్నిలక ర్యాలీలో యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ… తాలిబాన్ మైండ్ సెట్ ను గాజాలో ఇజ్రాయెల్ ఎలా అణచి వేస్తోందో మీరు చూస్తున్నారా? అని అడిగారు. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదిస్తూ, కఠినంగా అణచివేస్తోందని తెలిపారు. కశ్మీర్ నుంచి ఉగ్రవాదం వరకు దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ కారణమని ఆయన ఆరోపించారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని చెప్పారు. సర్దార్ పటేల్ కశ్మీర్‌ను భారత్‌లో అంతర్బాగం చేశారని తెలిపారు. కానీ కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ కూడా సమస్యలను సృష్టించారని అన్నారు. దాని కారణంగా కశ్మీర్లో ఉగ్రవాదం వ్యాపించిందన్నారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కశ్మీర్‌ను సమస్య రహితంగా మార్చారని వెల్లడించారు. కశ్మీర్ నుంచి తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. అరాచకం, గూండాయిజం, ఉగ్రవాదంలో రాజకీయాలు చిక్కుకున్నాయన్నారు. అది నాగరిక సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు.