ఒక్కోసారి ఆవేశం ఆలోచనను కోల్పోతుంది. ఆ సమయంలో తీసుకొనే అనాలోచిత నిర్ణయాలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఈ ఆవేశం వివేకవంతుణ్ణి కూడా ఆవివేకిగా మారుస్తోంది. ఇలాగే ప్రస్తుతం ఓ కానిస్టేబుల్ (Constable) కూడా ఆవేశానికి లోనై హంతకుడిగా మారాడు.
హన్మకొండ (Hanumakonda) జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకొంటే.. పోలీస్ డిపార్ట్ మెంట్ (Police Department) లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న ప్రసాద్ (prasad ) అనే వ్యక్తి హన్మకొండలో నివసించే తన అత్త (aunt) వారింటికి డబ్బుల విషయంపై మాట్లాడడానికి వెళ్ళాడు. ఏడాది క్రితం ఇచ్చిన నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ అత్తను కోరాడు. డబ్బుల విషయంలో కొన్ని రోజులుగా అత్తతో ఉన్న విబేధాలుకు తోడుగా ఈ రోజు కూడా అత్త, అల్లుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోంది.
మాటకు మాట పెరిగిన నేపధ్యంలో కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్ ప్రసాద్.. ఆవేశం ఆపుకోలేక, తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ తో అత్తను కాల్చి చంపాడు. అత్తను హత్య చేసిన అనంతరం ప్రసాద్ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని.. విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని.. డబ్బుల విషయంలో వివాదం నడుస్తుందని.. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.