Telugu News » Delimitation : డీలిమిటేషన్ జరిగితే.. దక్షిణాదికి అన్యాయమా..?

Delimitation : డీలిమిటేషన్ జరిగితే.. దక్షిణాదికి అన్యాయమా..?

రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియే ఈ డీలిమిటేషన్‌. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటు, అసెంబ్లీ సీట్లుండేలా చూసే ప్రక్రియ ఇది.

by admin
parliament of india

– దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పై జోరుగా చర్చ
– జనగణన ప్రకారం జరిగితే దక్షిణాదికి లాభమా? నష్టమా?
– పార్లమెంట్ స్థానాలు పెరిగే రాష్ట్రాలు ఎన్ని..?
– తగ్గబోతున్న సీట్లు ఎన్ని..?
– అసెంబ్లీ స్థానాల సంగతేంటి..?
– ప్రతిపక్షాలు ఏమంటున్నాయి..?

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా జనగణన, డీలిమిటేషన్‌ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో జనాభా లెక్కలు, డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఏయే సీట్లను రిజర్వ్ చేయాలనే దానిపై డీలిమిటేషన్ కమిషన్ మాత్రమే కాల్ చేయగలదని, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జనాభా లెక్కల డేటా మూలాధారమని ఆయన పేర్కొన్నారు. అయితే.. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

parliament of india

అసలేంటీ డీలిమిటేషన్..?

రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియే ఈ డీలిమిటేషన్‌. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటు, అసెంబ్లీ సీట్లుండేలా చూసే ప్రక్రియ ఇది. జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు కారణంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల జనాభా గణాంకాలను సేకరించి, అధ్యయనం చేసి డీలిమిటేషన్‌ కమిషన్‌ తుది నివేదికను ప్రిపేర్ చేస్తుంది. ఒక్కసారి ఇది జరిగిందంటే పార్లమెంటు కూడా మార్చలేదు. ఏ కోర్టులోనూ సవాల్ చేయడానికి లేదు. డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏది చెబితే అదే చట్టం.

పార్లమెంట్ సీట్ల అంచనా!

డీలిమిటేషన్ జరిగితే లోక్‌ సభ స్థానాల సంఖ్య 543 నుండి 753కి పెరగొచ్చని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ సంఖ్య పెరగొచ్చని కూడా చెబుతున్నారు. అయితే.. జనాభా లెక్కల ప్రకారం సీట్ల కేటాయింపు జరిగితే చాలా రాష్ట్రాల్లో సీట్లు తగ్గే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా దక్షిణాది (South Bharat) రాష్ట్రాలు సీట్లు తగ్గే లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. దేశంలో జనాభా నియంత్రణను సక్రమంగా పాటిస్తున్న రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ సీట్లు తగ్గే ఛాన్స్ ఉంది.

దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా?

ప్రస్తుత అంచనాల ప్రకారం.. తమిళనాడులో 39 స్థానాలకు 31 అయి.. 8 సీట్లు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కలిపి 42 సీట్లు ఉండగా.. 34కు పడిపోయే అవకాశం ఉంది. కేరళలో 20 నుంచి 12, కర్ణాటకలో 28 నుంచి 26కి సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అయితే.. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రస్తుతమున్న లోక్‌ సభ సీట్లు 80 నుంచి 143కు, బిహార్‌ సీట్లు 40 నుంచి 79కి పెరగొచ్చు. దీనివల్ల హిందీ రాష్ట్రాల ప్రాబల్యం పార్లమెంటులో ఎక్కువ అవుతుందనేది దక్షిణాది నేతల వాదన. జనాభా నియంత్రణను పాటించి, అభివృద్ధి చెందుతున్నందుకు తమకు అన్యాయం జరుగుతోందని.. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేదే లేదని అంటున్నారు.

You may also like

Leave a Comment