Telugu News » ABVP : తెలంగాణ విమోచన అమృతోత్సవాలు.. 75 వసంతాల సంబరాలు!

ABVP : తెలంగాణ విమోచన అమృతోత్సవాలు.. 75 వసంతాల సంబరాలు!

నిజాం సంస్థానం నుంచి విముక్తి పొందిన మహారాష్ట్ర (Maharashtra) లోని మారాట్వాడా, కర్ణాటక (Karnataka) లో ఉన్న బీదర్ ప్రాంతాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య ఉత్సవాలతో పాటుగా సెప్టెంబర్ 17 కూడా విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాయి. కానీ, తెలంగాణ ప్రాంతంలో మాత్రం పాలకుల తీరుతో ఇది జరగడం లేదు.

by admin
Special On Telangana Liberation Day

ఆర్.విష్ణువర్ధన్, ఏబీవీపీ గ్రేటర్ భాగ్యనగర్ సంఘటన కార్యదర్శి

ఆగస్టు 15, 1947న భారతదేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం మనందరికీ తెలుసు. కానీ, స్వాతంత్ర్యం పొందిన తర్వాత కొన్ని సంస్థానాలు దేశంలో కలవలేదు. సర్దార్ పటేల్ చొరవ వల్ల తర్వాతి కాలంలో అవి ఐక్యమయ్యాయి. వాటిలో ఒకటి తెలంగాణ. మరాట్వాడ, కళ్యాణ్ కర్ణాటక(బీదర్), తెలంగాణ ప్రాంతాలు కలిసి ఉండేది నిజాం సంస్థానం (Hyderabad State). దేశమంతా బ్రిటిష్ వాళ్ల నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే ఈ సంస్థానంలోని ప్రజలు నిజాం (Nizam) నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా శతాబ్ద కాలానికి పైగా పోరాటం చేశారు. ఎంతోమంది వీరులు తన ధన, మాన, ప్రాణ త్యాగాల ఫలితంగా నిజాం సంస్థానం సెప్టెంబర్ 17, 1948న దేశంలో ఐక్యమైంది. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం.

Special On Telangana Liberation Day

నిజాం సంస్థానం నుంచి విముక్తి పొందిన మహారాష్ట్ర (Maharashtra) లోని మారాట్వాడా, కర్ణాటక (Karnataka) లో ఉన్న బీదర్ ప్రాంతాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య ఉత్సవాలతో పాటుగా సెప్టెంబర్ 17 కూడా విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాయి. కానీ, తెలంగాణ ప్రాంతంలో మాత్రం పాలకుల తీరుతో ఇది జరగడం లేదు. కానీ, జాతీయవాద సంస్థలో తెలంగాణ (Telangana) విమోచన ఉద్యమకారుల పట్ల వారి త్యాగాల పట్ల మహోన్నత గౌరవం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నినదిస్తూ ప్రభుత్వాల నిర్బంధాన్ని ఎదిరిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్తలు అనేక సంవత్సరాలు ప్రభుత్వ సంస్థలపైన త్రివర్ణ పతాకాన్ని స్వయంగా ఎగురవేస్తున్నారు. అరెస్టు అవుతున్నారు. ఈసారి తెలంగాణ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన అమృతోత్సవాలు నిర్వహించడం శుభ పరిణామం.

నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుండి 1948 వరకు జరిపిన విరోచిత పోరాటమే తెలంగాణ విమోచన ఉద్యమం. ఓవైపు భారతదేశ స్వాతంత్ర్య సంబరాల్లో మునిగితేలుతూ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండగా మరోవైపు నిజాం రాజులు ఏలుబడి ఉన్న పల్లెల్ని రజాకార్ల మూకలు పట్టి పీడించాయి. వారిని ఎదిరించి పోరాడలేక పల్లె ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీశారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎందరో వీరుల త్యాగాలను స్ఫూర్తి పొంది.. గ్రామ గ్రామాన ఉవ్వెత్తున లేచే ఉద్యమాల తోడుగా నాటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగం అయింది.

తెలంగాణ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉద్యమ చరిత్రను, వీరుల పోరాటాలను బావి తరాలకు అందించాలనే సంకల్పంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సెప్టెంబర్ 17న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సంకల్పించింది. తెలంగాణ విమోచన ఉద్యమంలో ఎన్నో లక్షల మందికి స్ఫూర్తి నింపిన జలియన్ వాలాబాగ్ సంఘటనతో సమాన ఘటనలు జరిగినా చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మరుగున పరిచిన చరిత్రను సెప్టెంబర్ 17న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాలను సందర్శించడం.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబాలను సన్మానించడం.. అక్కడున్నటువంటి మట్టిని విద్యార్థులకు అందజేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ విమోచన ఉద్యమ వీరుల గాధలు, వారు చేసిన త్యాగాలు పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాఠ్య పుస్తకాలకు దూరమయ్యాయి. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన వీరులు.. భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ వీరుల త్యాగాలను గుర్తించుకోవడం మన కర్తవ్యం.

You may also like

Leave a Comment