Telugu News » ఆ రెండు జిల్లాల పేర్లను మారుస్తూ సర్కార్ నోటిఫికేషన్….!

ఆ రెండు జిల్లాల పేర్లను మారుస్తూ సర్కార్ నోటిఫికేషన్….!

మహారాష్ట్రలో రెండు జిల్లాల పేర్లను మారుస్తూ ఏక్ నాథ్ షిండే సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

by Ramu
Maharashtra Issues Notification On Name Change Of Aurangabad Osmanabad

మహారాష్ట్ర(Maharastra)లో రెండు జిల్లాల పేర్లను మారుస్తూ(Name change) ఏక్ నాథ్ షిండే(Eknath shinde) సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔరంగాబాద్ జిల్లా పేరును చత్రపతి శంభాజీ నగర్(chatrapathi shambaji nagar), ఉస్మానాబాద్ జిల్లాలను ధారాశివాగా(Dhara shiva) మారుస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.

Maharashtra Issues Notification On Name Change Of Aurangabad Osmanabad

ఈ జిల్లా పేర్లను మార్చాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాల పేరు మార్పుపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా సబ్ డివిజన్, తాలుకా, జిల్లా స్థాయిలో పేర్లు మార్చాలని నిర్ణయించినట్టు నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ఆయా జిల్లాల పేర్లు మార్చాలని అప్పటి మహావికాస్ అఘాడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు గతేడాది జూన్ 29న నిర్వహించిన కేబినెట్ చివరి సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత షిండే సర్కార్ కొలువు దీరింది. మహావికాస్ అఘాడీ తీసుకున్న నిర్ణయం చెల్లదని తెలిపారు. మహా వికాస్ అఘాడీ సర్కార్ ను గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించిన తర్వాత ఈ పేర్లు మార్పు నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకుందని షిండే సర్కార్ తెలిపింది.

అందువల్ల ఈ నిర్ణయానికి చట్టపరంగా చెల్లుబాటు ఉండదని పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లాల పేర్లను మార్చాలని షిండే సర్కార్ లోని కేబినెట్ గతేడాది జూలైలో మరో తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో మహావికాస్ అఘాడియా సర్కార్ ఔరంగాబాద్ జిల్లా పేరును శంభాజీ నగర్ గా మార్చనున్నట్టు ప్రకటిచింది. తాజాగా దానికి చత్రపతి అనే పేరు కలిసి కొత్త పేరును షిండే సర్కార్ ఆమోందించింది.

You may also like

Leave a Comment