బుధవారం ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.అరుదైన సూపర్ బ్లూ మూన్ (blue moon) కనిపించనుంది. సాధారణం కన్నా చంద్రుడు(moon) పెద్దగా దర్శనం ఇవ్వబోతున్నాడు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది.
సాధారణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్ లు ఏర్పడుతూవుంటాయి. కానీ, బుధవారం ఏర్పడబోయే సూపర్ బ్లూ మూన్ మాత్రం చాలా అరుదు. ఆ అద్భుతాన్ని ఇప్పుడు చూడకపోతే మళ్లీ 2037 వరకు సూపర్ బ్లూ మూన్ ను మనం చూడలేకపోవచ్చు. ఫుల్ మూన్ సమయంలో జాబిల్లి కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది.
చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరిగే క్రమంలో చంద్రుడు కొన్ని సార్లు భూమికి తక్కువ దూరంలో ఉంటాడు దీన్ని పెరజీ అని, దూరంగా పాయింట్ ను అపోజీగా పేర్కొంటారు.బుధవారం పెరజీ పాయింట్ వద్ద చంద్రుడు భూమికి దగ్గర రాబోతున్నాడు.
ఈ సమయంలో చంద్రుడు సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా కనిపించబోతున్నాడు. దీంతోపాటు 30 శాతం అధికంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇవాళ్టి పున్నమి చంద్రుడిని బ్లూ మూన్ గా పిలుస్తారు. అంతే తప్ప చందమామ నిజంగా నీలం రంగులో కనిపించదు