Telugu News » Chandra Babu : సుప్రీం కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు…..!

Chandra Babu : సుప్రీం కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు…..!

కేసును ధర్మాసనం అక్టోబర్ 3కు కేసును వాయిదా వేసింది.

by Ramu
supreme court adjourns chandrababu quash petition to october 3

సుప్రీం కోర్టు (Supreme Court)లో చంద్రబాబు (Chandra Babu) కు చుక్కెదురైంది. స్కిల్ డెవలప్ మెంట్‌ కేసు (Skill Development Case) లో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీం కోర్టుకు సెలవులు ఉండటంతో కేసును ధర్మాసనం అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

supreme court adjourns chandrababu quash petition to october 3

ఈ పిటిషన్ మొదట జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిల ధర్మాసనం ముందుకు వచ్చింది. కానీ ఆ పిటిషన్ పై విచారణకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్ పై విచారణ చేపట్టాలని సీజేఐ ముందు సిద్దార్థ్ లూథ్రా మెన్షన్ చేశారు. ఈ సందర్బంలో ఆయన సీజేఐకి రెండు అభ్యర్థనలు చేశారు. ఈ పిటిషన్ ను వీలైనంత త్వరగా లిస్టు చేయాలని, చంద్రబాబుకు మధ్యంతర ఉపశమనం కలిగించాలని ఈ సందర్బంగా సీజేఐని ఆయన కోరారు.

17 ఏ అనేది కేసు మూలాల గురించి చర్చించాల్సిన అంశమని సిద్దార్థ్ లూథ్రా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం చూస్తే చంద్రబాబును కస్టడీలో పెట్టకూడని కేసు ఇదన్నారు. ఈ కేసులో తాము బెయిల్ కోరు కోవడం లేదని, తాము కేవలం పోలీసు కస్టడీ నుంచి మినహాయింపును మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఆయన ప్రశ్నించారు.

జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ఓ వ్యక్తిని ఇలా ట్రీట్ చేయడం సరికాదన్నారు. ఇధి వ్యక్తిగత స్వేచ్చకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తిగత స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని న్యాయ స్థానం దృష్టికి తీసుకు వచ్చారు.

 

You may also like

Leave a Comment