Telugu News » Vanama : వనమాకు గుడ్ న్యూస్.. కానీ..!

Vanama : వనమాకు గుడ్ న్యూస్.. కానీ..!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ప్రస్తుతానికి స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

by admin
Supreme Court Stay on Disqualification of MLA Vanama Venkateswara Rao

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా నాగేశ్వరరావు (Vanama nageswararao) పేరు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో మార్మోగుతూనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఈయన కుమారుడి ఘనకార్యంతో పరువు పోగొట్టుకున్న ఈయన.. ఈమధ్య హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పుతో డీలా పడిపోయారు. రక్షించండి మహాప్రభో అంటూ సుప్రీంకోర్టు (Supreme Court) మెట్లెక్కారు. అయితే.. అక్కడ ఆయనకు ఊరట లభించింది. కానీ, ఇది తాత్కాలికమే.

2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు వనమా వెంకటేశ్వరరావు. ఆ సమయంలో తన అఫిడవిట్‌ లో తప్పుడు సమాచారం ఇచ్చారని.. జలగం వెంకటరావు (Jalagam Venkatrao) హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తప్పుడు వివరాలతో ఎన్నికైన వనమా ఎన్నిక చెల్లదంటూ గత నెల 25న తీర్పునిచ్చింది. రూ.5 లక్షల జరిమానా విధించి.. పిటిషనర్ వెంకటరావుకి అయిన కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ.. వనమా సుప్రీం మెట్లెక్కారు. వాదనలు విన్నఅనంతరం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ప్రస్తుతానికి స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో యథావిధిగానే వనమా ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. వనమా మాట్లాడుతూ.. కష్టకాలంలో తన వెంట ఉన్న నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కేసులో చివరకు ఏం జరగబోతున్నది అనేది ఆసక్తి రేపుతున్నది. 2018 ముందస్తు ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా పోటీ చేశారు. బీఆర్​ఎస్​ అభ్యర్థిగా జలగం వెంకటరావు నిలబ్డారు. 4 వేలకు పైగా ఓట్ల తేడాతో వనమా గెలుపొందారు. అయితే.. కొన్నాళ్లకు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

You may also like

Leave a Comment