సమాజంలో మార్పు మంచిదే.. కానీ ఆ మార్పు స్వార్ధంగా, ఆశగా మారితే మాత్రం కష్టం. ప్రస్తుతం మనుషులు లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డారు. అందుకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనుకాడటం లేదు. చట్టం పట్ల కాస్త భయం కూడా లేదు.
అందుకే ఎన్ని చర్యలు తీసుకొన్న క్రైమ్ రేటు తగ్గడం లేదు. వివిధ మార్గాలలో అక్రమాలు యధేచ్చగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉన్నా బంగారం (Bangaram) అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. అధికారులు కేటుగాళ్లని చాకచక్యంగా పట్టుకుంటున్న అక్రమ రవాణా కేసులు నిత్యం వెలుగు చూస్తున్నాయి.
డిటర్జెంట్ సర్ఫ్‌లో బంగారాన్ని ఉంచి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన స్మగ్లర్స్ ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే ఇదే విషయంలో మరో ప్రయాణికుడు అధికారులకు పట్టుబడటం శంషాబాద్ విమానాశ్రయంలో వెలుగు చూసింది..
రియాద్ (Riyad) అనే వ్యక్తి మస్కట్ (Mascot) మీదుగా ఒమన్ ఎయిర్‌లైన్స్ లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా తిరగడం గమనించిన అధికారులు అతనిని విచారించి తనిఖీ చేయగా.. అతని దగ్గర 2 బంగారు బిస్కెట్లు, 01 బంగారు చైన్ బయటపడ్డాయి. వెంటనే ఆ ప్రయాణికుడి దగ్గర ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న CISF అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, కస్టమ్స్ అధికారులకు అప్పగించారు..