ఈమధ్య తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) హెలికాప్టర్ లో సాంకిత సమస్య తలెత్తడంతో ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. తాజాగా మరోసారి సీఎం హెలికాప్టర్ మొరాయించింది. ఆసిఫాబాద్ (Asifabad) లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బయల్దేరి వెళ్తుండగా హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ వెంటనే నిలిపివేశాడు.
రెండు రోజుల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సభల కోసం వెళ్తుండగా ఇలాగే జరిగింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్ ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండ్ చేశారు. తర్వాత మరో హెలికాప్టర్ లో వెళ్లి.. కేసీఆర్ ప్రచారాన్ని ముగించారు.
ఇప్పుడు మరోసారి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్ కాగజ్ నగర్ లో సీఎం హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. తిరిగి బయలు దేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మార్గాన ఆసిఫాబాద్ కు సీఎం బయలుదేరి వెళ్లారు.