2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ బడ్జెట్ (vote on budget account)ను ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన అన్ని ప్రాజెక్టులపై విచారణ చేపడతామని మంత్రి భట్టి విక్రమార్క.స్పష్టం చేశారు.
కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో ఇరిగేషన్ వ్యవస్థ నాశనం అయ్యిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీటి పారుదల శాఖపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు.. నీటి పారుదల రంగానికి చెందిన నిపుణులతో చర్చించి.. ప్రాధాన్యత ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
తక్కువ వ్యయంతో అత్యంత త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదట ప్రాధాన్యత ఇచ్చి వాటని త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఈ సందర్బంగా పేర్కొన్నారు. నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఈ బడ్జెట్ లో రూ. 28 వేల 024 కోట్లను కేటాయిస్తున్నట్లు వివరించారు.
మహాత్మ గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టం పాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఆర్ఎస్పీ ఇందిరమ్మ వరద నీటి కాల్వ, జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కోమురం భీం, చిన్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటిని త్వరగా పూర్తి చేసి.. భూములకు నీళ్లు విడుదల చేస్తామన్నారు.