ఆసియా క్రీడ (Asian Games )ల్లో భారత అథ్లెట్లు (Indian Athlets) సత్తా చాటుతున్నారు. తాజాగా టెన్నీస్ (Tennis) జోడీ రోహన్ బోపన్న, రుతుజా భోంసలేలు దుమ్ము లేపారు. మిక్స్ డ్ డబుల్స్ (Mixed Doubles) ఫైనల్‌లో చైనీస్ తెపీ జోడీ సుంగ్-హావో హువాంగ్, ఎన్-షువో లియాంగ్‌పై 2-6,0-6 తేడాతో మట్టి కరిపించి బోపన్న జోడీ స్వర్ణాన్ని (Gold Medal) ముద్దాడింది.
దీంతో భారత పతకాల సంఖ్య 35కు చేరుకుంది. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు అద్భుతంగా రాణించారు. దీంతో భారత జోడీ సరబ్జోత్ సింగ్, దివ్య టీఎస్ సిల్వర్ పతకాన్ని అందుకున్నారు. ఇప్పటి వరకు షూటింగ్‌లో భారత్ 19 పతకాలను సాధించింది. ఇక పురుషుల లాంగ్ జంప్ విభాగంలో మురళి శ్రీ శంకర్ ఫైనల్ కు అర్హత సాధించారు.
ఇక ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్ పొందిన పతకాల సంఖ్య 35 కు చేరుకుంది. అందులో 9 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్యలు వున్నాయి. ఇక భారత్ కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్లు ప్రీతి, లవ్లీనా బోర్గోయిన్ లు సెమీఫైనల్ లోకి చేరుకున్నారు. దీంతో మరో రెండు పతకాలు ఖాయం కానున్నాయి.
ఇక భారత బాక్సర్ నరేందర్ 92 కిలోల విభాగంలో సెమీ ఫైనల్ కు చేరుకున్నారు. దీంతో నరేందర్ కు ఏదో ఒక పతకం వచ్చే అవకాశం ఉంది. స్క్వాష్ లో దాయాది పాక్ తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ కూడా సెమీఫైనల్ కు చేరుకుంది. ఉమెన్స్ 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో జ్యోతీ ఎర్రాజీ, నిత్యా రామ రాజ్ లు ఫైనల్ కు చేరుకున్నారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్ లో దక్షిణ కొరియాతో భారత్ జట్టు తలపడనుంది.