తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ (Telangana Former governer Tamili Sye) ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా గడుపుతున్నారు. మొన్నటివరకు తెలంగాణ గవర్నర్గా పాలనా పారమైన విధుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు సాయం అందించారు. విలువైన సలహాలు, సూచనలు అందించారు. ఉన్నట్టుండి తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తన గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు.
ఈ క్రమంలోనే తమిళి సైకు దక్షిణ చెన్నై(South Chennai) నుంచి బీజేపీ(BJP) అధిష్టానం టికెట్ ఇచ్చింది. తమిళనాడులో పార్లమెంట్ తొలి ఫేజ్ లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ప్రచారంలో తిరుగుతున్నారు. చెన్నైలోని ఎక్కటుతంగల్ నుంచి ప్రచార ప్రారంభించిన తమిళి సై.. ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ప్రజలు మాకు ఓటేస్తామని భరోసా ఇస్తున్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే మౌలిక వసతుల కల్పనకు దృష్టి సారించడం లేదు. కేవలం మాటలపైనే ఫోకస్ పెట్టారు. వర్షాలు కురిస్తే నగరంలో వరదలు ముంచెత్తుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక మంచి నిర్మాణలు చేపడుతాం. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం.. చెన్నైలో నీటి ఎద్దడి, వరదలు లేకుండా చేయడమే మా మొదటి లక్ష్యం అని చెప్పుకొచ్చారు.
గతంలో వైద్యురాలిగా, తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్గా పనిచేసిన తమిళై సై ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వేషాధారణ, రంగును కొందరు ట్రోల్(Trolling) చేస్తున్నారు. ఎండలో ప్రచారం కారణంగా ఆమె కాస్త నల్లగా మారడంతో కొందరు ఆకతాయిలు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.