షహీద్ ఆలమ్ బేగ్ (Shaheed Alam Beg).. సిపాయిల తిరుగుబాటు (sepoy mutiny)లో మంగళ్ పాండే తర్వాత చెప్పుకోదగిన గొప్ప భారత సిపాయి. 1857 ఉద్యమ సమయంలో బ్రిటీష్ వారికి ఎదురు తిరిగి డాక్టర్ గ్రాహమ్, హంటర్ అనే అధికారులను హత మార్చిన గొప్ప సేనాని. సిపాయిల తిరుగుబాటు అణచి వేతకు గుర్తుగా షహీద్ ఆలమ్ బేగ్ పుర్రెను బ్రిటీష్ వారు తీసుకు వెళ్లారంటేనే ఆయన శౌర్య ప్రతాపాలు ఎలాంటివో అర్థం అవుతుంది.
బెంగాల్‌లోని 46వ రెజిమెంట్‌కు చెందిన సైనికుడు హవల్దార్ ఆలమ్ బేగ్. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో సియాల్ కోట్లో పని చేశాడు. తిరుగుబాటు మొదలైన సమయంలో పంజాబ్‌లో ఇద్దరు బ్రిటీష్ అధికారుల కుటుంబాలను ఆలమ్ బేగ్ హత మార్చాడు. దీంతో ఆగ్రహంతో ఆలమ్ బేగ్‌ను ఫిరంగితో బ్రిటీష్ అధికారులు పేల్చి చంపారు.
సిపాయిల తిరుగుబాటు అణచివేతకు గుర్తుగా ఆలమ్ బేగ్ తలను బ్రిటన్ కు తీసుకు వెళ్లారు. ఆ తర్వాత దాని గురించి అంతా మరచి పోయారు. ఆ తర్వాత 1963లో కెంట్లోని వాల్మర్ లోని లార్డ్ క్లైడ్ పబ్‌లో ఓ పుర్రెను గుర్తించారు. 2014లో ఆ పుర్రెను పబ్ యజమానులు వాగ్నర్ అనే చరిత్ర కారుడికి ఆ పుర్రెను బహుమానంగా అందించారు. దీంతో ఆయన దానిపై పరిశోధనలు చేశారు.
ఆ పుర్రెలో ఓ కాగితాన్ని ఆయన గమనించారు. ఆ కాగితంలో ఆలమ్ బేగ్ గురించి, ఆయన్ని హత మార్చిన విషయం గురించి ఆ కాగితంలో రాసి ఉంది. ఆ తర్వాత ఆలమ్ బేగ్ చరత్రను ‘ది స్కల్ ఆఫ్ ఆలమ్ బేగ్’అనే పుస్తకాన్ని రచించాడు. ఇందులో ఆలమ్ బేగ్ జీవిత చరిత్రను వాగ్నర్ వివరించారు. ఆ తర్వాత నేచురల్ హిస్టరీ మ్యూజియం పుర్రె ప్రామాణికతను ధ్రువీకరించింది.