పార్లమెంట్ (Parliament) పై ఉగ్రదాడికి నేటితో 22 ఏండ్లు పూర్తయింది. ఆ పాత గాయాలను ఈ రోజు నెమరు వేసుకుంటున్న తరుణంలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. లోక్ సభ (Loke Sabha)లోకి ఇద్దరు ఆగాంతకులు ప్రవేశించి గందరగోళం సృష్టించారు.
ఈ ఘటనతో అందరూ ఒక్క సారిగా గందరగోళానికి గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత లోక్ సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా లోక్ సభలోకి దూసుకు వచ్చారు. నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అక్కడ గ్యాస్ సిలిండర్లను ఓపెన్ చేశారు. అనంతరం అక్కడ సభలో అటు ఇటు తిరిగారు.
సభలో సభ్యులు కూర్చునే బెంచీలపై అటు ఇటు ఎగిరి దూకారు. వెంటనే విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది లోక్ సభలోకి ప్రవేశించి దుండగులను పట్టుకున్నారు. ఇది ఇలా వుంటే పార్లమెంట్‌లో భద్రతా పరమైన లోపాలు తలెత్తడంపై కేంద్రం సీరియస్ అయింది. దీనిపై దర్యాప్తు జరుప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పార్లమెంట్ లో భద్రతా లోపాలపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సందర్శకుల గ్యాలరీలోకి అనుమతుల విషయంలో భద్రతా సిబ్బంది సరైన చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా వుంటే ఈ ఘటన నేపథ్యంలో సభలో గందర గోళం నెలకొనడంతో లోక్ సభను వాయిదా వేశారు.